Vaishnavi Chaitanya: ఎపిక్ టీజర్ లాంచ్: వైష్ణవీ చైతన్యపై హీరో క్రేజీ కామెంట్స్
వైష్ణవీ చైతన్యపై హీరో క్రేజీ కామెంట్స్

Vaishnavi Chaitanya: తెలుగు తెరపై 'బేబీ' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రేజీ జోడీ ఆనంద్ దేవరకొండ , వైష్ణవీ చైతన్య మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరు జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఎపిక్’ (Epic). #90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆనంద్ దేవరకొండ తన కో-స్టార్ వైష్ణవీ చైతన్య గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. "వైష్ణవీతో కలిసి నటించడం నాకు చాలా ఈజీగా ఉంటుంది. దానికి ప్రధాన కారణం తనకి తెలుగు చక్కగా మాట్లాడటం రావడం. భాషపై పట్టు ఉండటం వల్ల ఎంత పెద్ద డైలాగ్స్ ఉన్నా, సుదీర్ఘమైన సీన్స్ ఉన్నా ఎలాంటి బ్రేక్ లేకుండా ఎమోషన్స్ పండించగలుగుతాం" అంటూ తన సహ నటిపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సినిమాలో మరో స్థాయికి వెళ్తుందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది.
దర్శకుడు ఆదిత్య హాసన్ మార్క్ ఎమోషన్స్, యూత్ ఫుల్ కంటెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 'ఎపిక్' అనే టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ కథలో ఏదో కొత్తదనం ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. టీజర్‌లో చూపించిన విజువల్స్, మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. బాక్సాఫీస్ వద్ద మరోసారి ఈ జంట మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి 'బేబీ' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్-వైష్ణవీ జంట 'ఎపిక్'తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

