Saraswathi Pre-Release Event: సరస్వతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరలక్ష్మి ఎమోషనల్
వరలక్ష్మి ఎమోషనల్

Saraswathi Pre-Release Event: వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'సరస్వతి' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో చాలా ఎమోషనల్‌గా సాగింది. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, దర్శకురాలిగా తనను తాను నిరూపించుకోవడానికి ఇది ఒక సవాల్ అని అన్నారు.
"దర్శకత్వం అనేది నా డ్రీమ్. ఈ కథను రాసుకున్నప్పటి నుండి, తెరపైకి తీసుకువచ్చే వరకు ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. నటిగా కంటే దర్శకురాలిగా బాధ్యత చాలా ఎక్కువగా అనిపించింది" అని చెప్పారు. "ప్రతి మహిళలో ఒక 'సరస్వతి' ఉంటుంది, కానీ అవసరమైనప్పుడు ఆమె 'కాళి'గా మారుతుంది అంటూ సినిమాలో తన పాత్ర స్వభావాన్ని ,మహిళా సాధికారతను ఉద్దేశించి మాట్లాడారు.తన తండ్రి శరత్ కుమార్ తనపై ఉంచిన నమ్మకమే ఈ రోజు తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, ప్రియమణి తనకు ఇచ్చిన సహకారం మరువలేనిదని, వారి అనుభవం సినిమాకు పెద్ద ప్లస్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్‌లతో పాటు సీనియర్ నటి సిమ్రాన్ కూడా హాజరయ్యారు. వరలక్ష్మిలోని దర్శకత్వ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయానని సిమ్రాన్ ప్రశంసించారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకు అందించిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమా మార్చి 6 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

