‘Varanasi’ Movie:నైజాం ఏరియాలో వారణాసి నయా రికార్డ్
వారణాసి నయా రికార్డ్

‘Varanasi’ Movie: ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 14 నెలల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే థియేట్రికల్, ఓటీటీ డీల్స్ కోసం భారీ స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా ఏ సినిమాకైనా నైజాం ఏరియా బిజినెస్ కీలకం. రాజమౌళి సినిమా కావడంతో ఇక్కడ పోటీ మామూలుగా లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ఏరియా పంపిణీ హక్కుల కోసం కళ్లు చెదిరే రేటును కోట్ చేసినట్లు తెలుస్తోంది. గత సినిమాల రికార్డులను తిరగరాసేలా ఈ డీల్ ఉండబోతోందని టాక్.
ఈ సినిమా కేవలం తెలుగు లేదా ఇండియన్ సినిమా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ప్రాజెక్ట్. అందుకే ఓవర్సీస్ (విదేశీ) పంపిణీ హక్కుల కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియో ఆసక్తి చూపుతుండటం విశేషం. గతంలో 'RRR' సాధించిన బిజినెస్ కంటే ఎంతో ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, రాజమౌళి టీమ్ ఇంకా పెద్ద మొత్తాన్ని ఆశిస్తుండటంతో ప్రస్తుతం ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
నెట్‌ఫ్లిక్స్ తో భారీ ఓటీటీ డీల్?
డిజిటల్ హక్కుల విషయంలో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ముందు వరుసలో ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం రాజమౌళి ఏకంగా రూ. 500 కోట్లు ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా పెద్ద మొత్తం అయినప్పటికీ, రూ. 300 నుండి 400 కోట్ల మధ్య డీల్ కుదిరే అవకాశం ఉంది. ఒకవేళ ఇది జరిగితే, భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటీటీ డీల్‌గా నిలుస్తుంది.

