గ్లోబల్ ప్రెజెంటేషన్

Varanasi: మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ లెవల్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ప్రమోషన్స్ కూడా అదే లెవల్‌లో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లోబల్ ప్రెజెంటేషన్‌ను మెక్సికోలో నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.
శుక్రవారం జరగనున్న ప్రతిష్టాత్మక సీసీఎక్స్‌పీ–2026 ఈవెంట్‌లో ‘వారణాసి’ చిత్రం కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ సీన్స్‌ను ప్రదర్శించబోతున్నారు. అలాగే మూవీ మేకింగ్ విషయాలను కూడా అక్కడి ప్రేక్షకులతో రాజమౌళి షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాజమౌళితోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొంటారు. ఓ వైపు శరవేగంగా షూటింగ్ చేస్తూనే, మరోవైపు ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన జక్కన్నను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేయగా, ప్రస్తుతం అంటార్కిటికాలో ఓ యాక్షన్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ ట్రాటర్ పేరుతో ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు, సంచారి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.

