తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్..

Varanasi Teaser Releasing Today: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి' (Varanasi) సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక 'లే గ్రాండ్ రెక్స్' (Le Grand Rex) థియేటర్ వేదికగా ఇవాళ రాత్రి 9:00 గంటలకు (స్థానిక పారిస్ సమయం) ప్రదర్శించనున్నారు. యూరప్‌లోనే అతిపెద్ద థియేటర్ అయిన 'లే గ్రాండ్ రెక్స్'లో ఒక భారతీయ సినిమా ప్రమోషనల్ కంటెంట్ (టీజర్) ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి. ఫ్రెంచ్ పంపిణీ సంస్థ 'అన్న ఫిల్మ్స్' (Aanna Films) ఈ ప్రతిష్టాత్మక స్క్రీనింగ్‌ను నిర్వహిస్తోంది. గత నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వారణాసిలో మహేష్ బాబు (రుద్ర పాత్రలో), ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని, నంది (ఎద్దు) పై వస్తున్న విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచాయి. పారిస్‌లో ప్రదర్శించబోయే ఈ టీజర్ ద్వారా సినిమాలోని మరిన్ని లొకేషన్లు (అంటార్కిటికా, అమెజాన్ అడవులు) హాలీవుడ్ స్థాయి విజువల్స్ చూపించబోతున్నట్లు సమాచారం.మార్చి 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story