Varun Tej: సీమ వంటకాలతో వరుణ్ తేజ్ ప్రమోషన్ల రచ్చ... గాయపడినా తగ్గేదే లేదంటున్న కొరియన్ కనకరాజు
కొరియన్ కనకరాజు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రచార పర్వాన్ని వినూత్నంగా వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ రాయలసీమ ఘుమఘుమల రుచులను ఆస్వాదిస్తూ సందడి చేశారు.
స్ట్రీట్ బైట్ ఫుడ్ వ్లాగర్‌తో కలిసి హంగామా
సినిమా ప్రమోషన్స్‌ను మరింత రీచ్ చేయడం కోసం చిత్రబృందం ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రముఖ ఫుడ్ వ్లాగర్‌తో కలిసి వరుణ్ తేజ్ రాయలసీమ ప్రత్యేక వంటకాలను రుచి చూశారు. దీనికి సంబంధించిన కలర్‌ఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సరదా ఫుడ్ వ్లాగ్ పూర్తీ వీడియోను అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
గాయాన్ని సైతం లెక్కచేయని నిబద్ధత
ఇటీవల జరిగిన ఒక ఘటనలో వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ సినిమా ప్రచారానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆయన చేతి కర్ర సాయంతోనే ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గాయపడినా సినిమా కోసం ఆయన చూపిస్తున్న డెడికేషన్‌పై అభిమానులు, సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌తో పాటు తమన్ స్వరపరిచిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. డిఫరెంట్ ప్రమోషన్లతో వస్తున్న ఈ కామిక్ ఎంటర్‌టైనర్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

