Actor Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం "బరి" (Bhari) కోసం సిద్ధమవుతున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లో వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆయనకు గాయమైంది. కోస్తా ఆంధ్ర నేపథ్యంలో సాగే గ్రామ స్థాయి వాలీబాల్ పోటీల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ పాత్ర కోసం వరుణ్ గత కొన్ని రోజులుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో అనుకోకుండా కింద పడటంతో ఆయన కాలికి గాయమైంది.

ప్రస్తుతానికి ఈ గాయం పెద్దది కానప్పటికీ, ముందు జాగ్రత్తగా వరుణ్ తేజ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో మైనర్ సర్జరీ చేయించుకోనున్నారు. వైద్యులు ఆయనకు కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిహారిక కొణిదెల తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, "కమిటీ కుర్రోళ్లు" ఫేమ్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, వరుణ్ కోలుకున్న తర్వాతే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల షూటింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరగవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story