Vayuputra: 3D యానిమేషన్ లో వాయుపుత్ర..రిలీజ్ ఎపుడంటే?
రిలీజ్ ఎపుడంటే?

Vayuputra: కార్తికేయ 2, తండేల్' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన డైరెక్టర్ చందూ మొండేటి.. హనుమంతుని కథ ఆధారంగా వాయుపుత్ర అనే కొత్త సినిమా తీస్తున్నారు. శ్రీరామచంద్రుని పరమ భక్తుడైన హనుమంతుని గురించి. భారతీయ ఇతిహాసాలలో ఒక ముఖ్యమైన పురాణ కథను ఆధునిక సాంకేతికతతో ముఖ్యంగా 3D యానిమేషన్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు.
నిన్న రిలీజ్ చేసిన వాయుపుత్ర ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పోస్టర్‌లో హనుమంతుడు లంకాదహనం చేస్తుండగా, అతని తోకకు నిప్పు అంటుకొని ఉంటుంది. 'మహావతార నరసింహ' వంటి యానిమేటెడ్ సినిమాలు ఇటీవల విజయం సాధించడంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థలైన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2026 దసరా పండుగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'వాయుపుత్ర' కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పాన్- ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
