Hari Hara Veeramallu: వీరమల్లు ట్రైలర్‌డేట్ ఫిక్స్
ట్రైలర్‌డేట్ ఫిక్స్

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించారు. జులై 24న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జులై 3న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడం కోసం ప్రతి ఫ్రేమ్ విషయంలో కేర్ తీసుకుంటున్నామని మేకర్స్ చెబుతున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మొఘల్ శక్తిని ధిక్కరించిన చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు విశేష స్పందన లభించింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
