ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Velu Prabhakaran: ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నటుడు వేలు ప్రభాకరన్(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతదేహాన్ని రేపు సాయంత్ర నుంచి జూలై 20 మధ్యాహ్నం వరకు చెన్నైలోని వలసరవక్కం నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. జులై 20న సాయంత్రం పోరూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. వేలు ప్రభాకరన్ మృతి పట్ల పలువురు తమిళ సినీ నటులు సంతాపం తెలిపారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

వేలు ప్రభాకరన్ 60 ఏళ్ల వయసులో 2017 రెండో పెళ్లి చేసుకున్నాడు. తనకంటే 25 ఏళ్లు చిన్నదైన చెర్లీదాస్ అనే మహిళను చేసుకుని హాట్ టాపిక్ గా మారాడు. 1989 లో నాలయ మణిదన్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. వేలు ప్రభాకరన్ నలయ మణితన్, కడవల్,కాదల్ కథై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. దర్శకుడిగానే కాకుండా వేలు ప్రభాకరన్ కొన్ని చిత్రాలలో నటుడిగా కూడా మెప్పించారు. చివరి సారిగా 2025లో గజానా చిత్రంలో నటించారు.

Updated On 18 July 2025 11:46 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story