‘Attahaasam’: వెంకటేష్ మహా కొత్త సినిమా ‘అట్టహాసం’.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

‘Attahaasam’: ‘C/O కంచరపాలెం’, ‘రావు బహదూర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.. తన తదుపరి సినిమాను ప్రకటించారు. ‘అట్టహాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయవంతమైన ‘కె.ఏ’ సినిమాను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ.. వెంకటేష్ మహాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు వెంకటేష్ మహా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక సినిమాలో కార్తిక్ రత్నం, పవని కరణం, శ్రావంతి పీపకాయల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘అట్టహాసం’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సినిమాలోని పాత్రలు, వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆసక్తిని కలిగించే క్యాప్షన్స్ ఉన్నాయి. దీంతో సినిమా కథ, కాన్సెప్ట్ ఏంటనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.
‘అట్టహాసం’ సినిమాను పూర్తిగా మన నేటివిటీకి దగ్గరగా ఉండే రియలిస్టిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా 2027 సమ్మర్‌లో థియేటర్లలోకి రానుంది.

