మూవీ టైటిల్ ఇదే..

Venkatesh–Trivikram Combo Confirmed: విక్టరీ వెంకటేశ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే క్లాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు.

ఫస్ట్ లుక్‌లో వెంకటేశ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌గా ఆహ్లాదకరంగా కనిపించడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో వెంకటేశ్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఆ చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని క్లాసిక్‌లుగా నిలిచాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story