Venky Mama Movie: మాటల మాంత్రికుడితో వెంకీ మామ మూవీ.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత
అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత

Venky Mama Movie: ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేశ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇది వెంకటేశ్ కెరీర్‌లో 77వ చిత్రం కావడం విశేషం. వెంకటేశ్ తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. గతంలో అనిల్ రావిపూడితో బ్లాక్‌బస్టర్ అందుకున్న వెంకటేశ్, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే మరో కుటుంబ కథాచిత్రాన్ని త్రివిక్రమ్‌తో కలిసి ప్రేక్షకులకు అందించనున్నారు.
20 నెలల తర్వాత త్రివిక్రమ్ రీఎంట్రీ!
వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారంటూ నాగవంశీ ట్వీట్ చేశారు. ఈ సినిమాను రాధాకృష్ణ సమర్పణలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
"వెంకీమామతో త్రివిక్రమ్ మరోసారి మ్యాజిక్‌ను సృష్టించడానికి సెట్స్‌పైకి వెళ్లనున్నారు" అంటూ వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. త్రివిక్రమ్ మార్క్ మాటలు, వెంకటేశ్ నటనతో ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
