మన శంకర వరప్రసాద్ గారు స్టైలిష్ లుక్ విడుదల

Venky’s Birthday Gift: ఈ రోజు విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి వెంకటేశ్ పవర్‌ఫుల్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పండగకు వస్తున్నారు.. అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ కొత్త పోస్టర్‌లో వెంకటేశ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి దిగి, గన్‌మన్ల పహారా మధ్య నడిచివస్తున్న ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ సినిమాలో వెంకీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని.. అదే సమయంలో ఆయన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ కలిసి నటించడం ప్రధాన ఆకర్షణ. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, వారిపై చిత్రీకరించే పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్ వంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story