వెంకీ మామ స్క్రీన్ షేర్

Victory Venkatesh: ఈ ఏడాది ప్రారంభంలో 'సం క్రాంతికి వస్తున్నాం' అంటూ భారీ హిట్ అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్.. ఇప్పుడు నెక్స్ట్ సినిమాల లైనప్ చెప్పి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు. అమెరికాలో జరిగిన 'నాట్స్ 2025'లో సందడి చేసిన వెంకీ మామ తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. అలాగే మెగాస్టార్ చిరు సినిమాలో గెస్టు రోల్ లో నటిస్తున్నాను. అది కేమియో రోల్.. చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. అలాగే మీనాతో కలిసి 'దృశ్యం 3'లో చేస్తున్నాను. ఇటీవల హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరోసారి మీ ముందుకు వస్తున్న. వీటన్నింటితో పాటు మరో భారీ ప్రాజెక్ట్ నందమూరి బాలయ్యతో ఓ మల్టీస్టారర్ చిత్రం ఉండ బోతుంది' అని వెంకీ అనౌన్స్ చేశాడు. అయితే, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక పెద్ద హీరోల మల్టీస్టారర్ చిత్రం కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాలకృష్ణ, వెంకటేష్ మల్టీస్టారర్... ఇది కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి కాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అధికారిక వివరాలు వెలువడగానే, అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు కావడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story