కారు గిప్ట్ ఇచ్చిన విఘ్నేశ్ శివన్

Vignesh Shivan Gifts ₹10-Crore Luxury Car to Nayanthara: కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార బర్త్ డే వేడకలు చాలా సింపుల్ గా జరిగాయి. ఎంతో మంది ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. పుట్టినరోజు వేళ నయన్ భర్త విఘ్నేశ్ శివన్ నుండి అత్యంత ఖరీదైన బహుమతిని అందుకున్నారు. విఘ్నేశ్ ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ ఖరీదైన కారుతో కుటుంబ సమేతంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంతోషకరమైన క్షణాలను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

"నా ప్రియమైన బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మాకు ఎప్పుడూ ఇలాంటి మధురమైన క్షణాలనే అందించాలి" అంటూ భావోద్వేగపూరితమైన క్యాప్షన్ రాశారు.

లగ్జరీ కార్ల సంప్రదాయం

విఘ్నేశ్ శివన్ తన భార్యకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం ఇది కొత్తేమీ కాదు, ఇది ఒక సంప్రదాయంగా మారింది:

2023: రూ. 3 కోట్ల మెర్సిడెస్ మేబ్యాక్ కారు.

2024: రూ. 5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్‌ఎస్ 600 కారు.

2025 : రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారు.

కెరీర్ పరంగా ఫుల్ బిజీ

ప్రస్తుతం నయనతార కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో, కన్నడ స్టార్ యశ్‌తో కూడా సినిమాలు చేస్తున్నారు. తమిళం, మలయాళ భాషల్లోనూ ఆమె చేతిలో డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన పుట్టినరోజు వేడుకలను మాత్రం కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story