Vijay and Rashmika Engaged: విజయ్, రష్మిక ఎంగేజ్ మెంట్ జరిగిందా.?
ఎంగేజ్ మెంట్ జరిగిందా.?

Vijay and Rashmika Engaged: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అక్టోబర్ 3న విజయ్ దేవరకొండలోని నివాసంలో ఇద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. వీరి వివాహం ఫిబ్రవరి 2026లో జరిగే అవకాశం ఉందని టాక్.
విజయ్ రష్మిక మంచి స్నేహితులు మాత్రమేనని, గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించడంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఈ స్నేహం కాస్త లవ్ వరకు వెళ్లింది.. వీరిద్దరు తరచూ ఫారెన్ ట్రిప్పుల్లోకలుసుకోవడం, కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో గత కొన్ని రోజులుగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే విజయ్ ఇంట్లో జరిగే శుభాకార్యాల్లో రష్మిక తరచూ పాల్గొంటుంది. ఇపుడు వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై విజయ్ కానీ, రష్మిక కానీ ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. వారిద్దరూ తమ వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడుతుండటంతో, అభిమానుల అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
