బిగ్గెస్ట్ మూవీ భద్రకాళీ

Vijay Antony: విజయ్ ఆంటోని నటించిన భద్రకాళి థియేటర్లలోరిలజీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ఆంటోని.. ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామా అని, ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.

భద్రకాళి పొలిటికల్ థ్రిల్లర్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా. గతంలో వచ్చిన రాజకీయ సినిమాలతో పోలిస్తే, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులు ఇదివరకెప్పుడూ చూడని ఒక కొత్త కథాంశంతో వస్తుందని విజయ్ ఆంటోని అన్నారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అరుణ్ ప్రభు తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడని, ఆయన ఎంతో టాలెంట్ ఉన్న టెక్నీషియన్ అని ప్రశంసించారు.

ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూనే, ఆలోచింపజేసే అంశాలను కూడా కలిగి ఉంటుందని ఆయన అన్నారు. సినిమా ప్రారంభం అయిన కొన్ని నిమిషాల నుంచే ప్రేక్షకులు కథలో లీనమైపోతారని చెప్పారు.భద్రకాళి తన కెరీర్‌లో 25వ సినిమా కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉందని తెలిపారు.

భద్రకాళి అనే టైటిల్‌తో దసరా నవరాత్రుల సమయంలో సినిమా విడుదల కావడం ఒక మంచి పరిణామమని, ఇది సినిమాకు కలిసి వస్తుందని విజయ్ ఆంటోని ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story