Vijay Antony: నా మేనల్లుడితో తెలుగు సినిమా చేస్తా
తెలుగు సినిమా చేస్తా

Vijay Antony: విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మార్గన్’. ఆయన మేనల్లుడు అజయ్ ధీషన్ కీలకపాత్ర పోషించగా లియో జాన్ పాల్ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు బుధవారం థ్యాంక్స్‌మీట్ నిర్వహించారు.
హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. డి.సురేష్ బాబు గారు, రామాంజనేయులు గారు చాలా గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో నా మేనల్లుడు అజయ్‌కు మంచి పేరు వచ్చింది. త్వరలో తనతో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా నిర్మించబోతున్నా. ప్రస్తుతం తమిళంలో ఏడు సినిమాలు చేస్తున్నా. ఆ చిత్రాల తెలుగు డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాను. త్వరలోనే నా నుంచి ‘భద్రకాళి’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రానుంది’ అని చెప్పాడు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని నటుడు అజయ్ ధీషన్, దర్శకుడు లియో జాన్ పాల్, రచయిత భాష్య శ్రీ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.
