Vijay Deverakonda and Rashmika: రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తాము 'రౌడీస్' కాదని, మంచి మనసున్న మనుషులని నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ , రష్మిక మందన! దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు కొండంత అండగా నిలిచారు.

విజయ్ దేవరకొండ స్వగ్రామమైన తుమ్మన్‌పేట సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. నల్లమల ప్రాంతంలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 181 మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. రష్మిక మందన, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి విజయ్ స్వయంగా ఈ ప్రోత్సాహకాలను అందించారు.9, 10 తరగతుల్లో ఫస్ట్ వచ్చిన వారికి 10 వేల రూపాయలు, సెకండ్ వచ్చిన వారికి 5 వేల రూపాయల చొప్పున నగదును అందించారు. విద్యాశక్తితోనే ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని విజయ్ దేవరకొండ ప్రకటించారు.పేద విద్యార్థుల చదువుకు ఆసరాగా నిలిచిన దేవరకొండ ఫౌండేషన్ టీమ్‌కు, విజయ్-రష్మికలకు సెల్యూట్ చేయాల్సిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం 180 మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నాగర్కర్నూల్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ మెరిట్ జాబితాను సిద్ధం చేయడంలో సహకరించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులందరికీ” ప్రత్యేక కృతజ్ఞతలు అని విజయ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా టాప్ స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తామన్న ప్రకటనపై సోషల్ మీడియాలో విజయ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story