Vijay Deverakonda and Rashmika Mandanna: విజయ్-రష్మికల థాయిలాండ్ సందడి: పెళ్లి తర్వాత కొత్త జంట ఎంజాయ్!
పెళ్లి తర్వాత కొత్త జంట ఎంజాయ్!

Vijay Deverakonda and Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ బిజీ లైఫ్ నుండి కాస్త విరామం తీసుకున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న ఈ జంట, వరుస షూటింగ్‌లు మరియు పెళ్లి వేడుకల హడావిడి ముగియడంతో రిలాక్స్ అవ్వడానికి థాయిలాండ్‌లోని కో స్యామ్యూ వెళ్లారు. దీన్ని వారు అధికారికంగా హనీమూన్ అని పిలవకపోయినా, ఈ చిన్న ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే మాత్రం కొత్త జంట ఫుల్ ఖుషీగా ఉన్నట్లు అర్థమవుతోంది. అభిమానులు ఈ జంట ఫోటోలను చూసి సోషల్ మీడియాలో తెగ మురిసిపోతున్నారు.
నిజానికి ఈ ట్రిప్ ఒక ప్రముఖ బ్రాండ్ ‘Airbnb’ కొలాబరేషన్‌లో భాగంగా జరిగినప్పటికీ, అక్కడ వారు గడిపిన క్షణాలు మాత్రం ఒక పర్ఫెక్ట్ హనీమూన్‌ని తలపిస్తున్నాయి. ఈ పర్యటన విశేషాలను వారు సోషల్ మీడియాలో పంచుకుంటూ, "పెళ్లి వేడుకల తర్వాత మాకు కాస్త ప్రశాంతత కావాలనిపించింది. అందుకే కొన్ని రోజులు ఇలా విరామం తీసుకున్నాం. ప్రశాంతమైన ఉదయాలు, మధ్యాహ్నం స్విమ్మింగ్, సాయంత్రం పూట టేబుల్ టెన్నిస్, పూల్ గేమ్స్‌తో గడిపాం. నవ్వులతో సాగిన సినిమా రాత్రులు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. కో స్యామ్యూలోని ఈ ఇల్లు మాకు సొంత ఇంటి ఫీలింగ్‌ను ఇచ్చింది" అని రాసుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఇద్దరు స్టార్స్ ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా విజయ్ మరియు రష్మిక మందన్న కలిసి ‘రణబలి’ అనే సినిమాలో మళ్ళీ వెండితెరపై మెరవనున్నారు. దీంతో గీత గోవిందం లాంటి హిట్ తర్వాత మళ్ళీ వీరిద్దరినీ జంటగా చూడబోతున్నామని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

