Vijay Deverakonda and Rashmika: తమ్ముడు ఆనంద్‌తో కలిసి విజయ్-రష్మిక అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..
విజయ్-రష్మిక అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..

Vijay Deverakonda and Rashmika: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకల అనంతరం ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కొత్త జంటతో కలిసి ఆనంద్ చేసిన డ్యాన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సందడిగా మారిన సంచారమే పాట:
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇటీవల విడుదలైన సంచారమే సాంగ్ యూత్‌లో బాగా పాప్యులర్ అయింది. ఈ ట్రెండీ సాంగ్‌కు అన్న విజయ్, వదిన రష్మికలతో కలిసి ఆనంద్ సరదాగా స్టెప్పులేశారు. ముగ్గురూ కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "ఇష్టమైన వారితో కలిసి ఇలాంటి క్షణాలు గడపడం కన్నా ఆనందం ఏముంటుంది?" అని క్యాప్షన్ ఇచ్చారు.
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అభిమానుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలన్నీ ముగియడంతో కొత్త జంట కాస్త విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు.
ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
ఈ వీడియో చూసిన నెటిజన్లు "పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్స్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. పెళ్లి తర్వాత రష్మిక తన కొత్త కుటుంబంతో ఎంతో సరదాగా కలిసిపోయిన తీరును చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

