పోయి టాప్ లో కూసుంటా..

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవర కొండ పుష్ప సినిమాలోని డైలాగ్‌లను గుర్తు చేస్తూ చిత్తూరు యాసలో మాట్లాడి అలరించారు. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ.. ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నడిపించినాడో.. శానా పెద్దోన్నై పూడుస్తా సామీ.. పోయి టాప్ లో కూసుంటా. అని అనడంతో ఫ్యాన్స్ కేకలు,అరుపులతో హోరెత్తించారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ, సంగీత దర్శకుడు అనిరుధ్ వంటి వారందరూ సినిమాను తనకంటే ఎక్కువగా చూసుకున్నారని చెప్పారు.ఎవ్వడూ మనల్ని ఆపేదేలే అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడారు విజయ్ దేవర కొండ. వెంకన్న స్వామి దయ, అభిమానుల ఆశీస్సులు ఉంటే తనను ఎవరూ ఆపలేరని అన్నారు.

అయితే ఈ ఈవెంట్‌కు ముందు విజయ్ దేవరకొండకు గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ కూడా ఎదురైంది. అయినప్పటికీ, విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఈవెంట్‌లో పాల్గొన్నారు. కింగ్‌డమ్ జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story