Vijay Deverakonda: డీసీ ఛాన్స్ వదులుకున్న విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ!
వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ!

Vijay Deverakonda: సినిమా పరిశ్రమలో ఒక హీరో వదులుకున్న కథ, మరో హీరో వద్దకు వెళ్లి సెన్సేషనల్ హిట్టవడం చాలా సాధారణం! సరిగ్గా అలాంటిసారే ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది. అదేనండి.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ'
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించిన ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోగా ముందుగా మన టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను సంప్రదించారట!
ఇందుకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతంలో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనకు ఒక అద్భుతమైన కథ వినిపించారని తెలిపారు. కథాకమామిషు బాగానే ఉన్నప్పటికీ.. తాను అప్పటికే ఆటోమెటిక్‌గా అలాంటిదే మరో ప్రాజెక్ట్ చేస్తుండటంతో, ఒకేలాంటి రెండు సినిమాలు చేయడం ఇష్టం లేక విజయ్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట.
అయితే, అరుణ్ మాథేశ్వరన్ విజయ్‌కి చెప్పిన ఆ కథే ఈ 'డీసీ' సినిమానా? కాదా? అనే దానిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. అటు విజయ్ గానీ, ఇటు దర్శకుడు అరుణ్ గానీ దీనిపై స్పందించలేదు. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం విజయ్ పాత ఇంటర్వ్యూ వ్యాఖ్యలను ఇప్పుడు 'డీసీ' సినిమాతో ముడిపెట్టి తెగ చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఆ సినిమా విజయ్ చేసి ఉంటే ఎలా ఉండేదోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. ఒక సినిమా అలా చేతులు మారి చివరకు లోకేశ్ కనకరాజన్ చేతిలోకి వెళ్లింది.

