కొత్త సినిమా అప్‌డేట్!

Vijay Deverakonda's New Movie: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తదుపరి చిత్రం గురించిన ఆసక్తికరమైన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. రౌడీ జనార్దన టైటిల్‌తో ఓ సినిమా తీయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 11న లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 16వ తేదీ నుంచి ముంబైలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ‘రాజావారు రాణిగారు’ సినిమా ఫేమ్ రవి కిరణ్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం. ఈ సినిమా రాయలసీమ ప్రాంత నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. 'రౌడీ జనార్దన' అనే టైటిల్ కూడా రాయలసీమ ప్రాంత బలమైన, ధైర్యవంతమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని అంచనా. ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ ఒక పెద్ద ప్రమాదం నుండి అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. పుట్టపర్తి నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. అయితే, విజయ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం అభిమానులకు ఊరట కలిగించింది. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో గాడ్ బ్లెస్ విజయ్ ”, “ స్టే సేఫ్ అన్నా” అంటూ అభిమానులు సందేశాలు వెల్లువెత్తించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story