‘రణబలి’

‘Ranabali’: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబలి’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా కథ, చెప్పాలనుకున్న విషయం బాగుందని కొందరు మెచ్చుకున్నా.. కథను తెరపై చూపించిన విధానం మాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదనే టాక్ వచ్చింది.
సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో పాటు.. మరోవైపు రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ నుంచి పోటీ ఉన్నప్పటికీ ‘రణబలి’ తన వసూళ్లను నిలబెట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. అదే ప్రాంతంలో ‘రణబలి’ ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ సినిమాలకు గత కొంతకాలంగా సీడెడ్.. అంటే రాయలసీమ ప్రాంతంలో లాభాలు రావడం కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ‘రణబలి’ రాయలసీమలో లాభాల్లోకి రావడం విజయ్‌కు మంచి విషయంగా చెప్పొచ్చు.
అలాగే నైజాం ప్రాంతంలో కూడా ‘రణబలి’ మంచి వసూళ్లు సాధిస్తోంది. మరో వీకెండ్ కూడా ఉండటంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
అక్టోబర్ 30న త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా థియేటర్లలోకి రానుంది. అప్పటి వరకు ‘రణబలి’ తన మంచి వసూళ్లను కొనసాగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

