Vijay: విజయ్ సమర్థుడు..ఆయనకు సలహాలు ఇవ్వలేను
ఆయనకు సలహాలు ఇవ్వలేను

Vijay: దక్షిణాది సినీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారు కదా.. సీనియర్‌గా మీరు ఆయనకు ఏమైనా సలహాలు ఇస్తారా? అన్నదే ఆ ప్రశ్న.
దీనికి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అత్యంత హుందాగా సమాధానమిచ్చారు. సాధారణంగా నేనెవరికీ సలహాలు ఇవ్వను అంటూనే.. విజయ్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేశారు. ప్రతి ఒక్కరికీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. విజయ్ ఒక పెద్ద హీరో అంతకంటే మిన్నగా ఆయన చాలా సమర్థుడు. అన్నీ ఆలోచించుకునే ఈ అడుగు వేసి ఉంటారు అని పవన్ వ్యాఖ్యానించారు.
జనసేన విత్ GenZ' కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. నేటి యువతకు మరియు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి ఒక విలువైన సూచన చేశారు. రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు.. అది ఒక బాధ్యత. 'మనం చేసే పనికి ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టపడాలి. సమాజంలో గొప్ప ప్రభావం చూపగలిగే వ్యక్తులు, ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు ప్రజాసేవలోకి రావడం నిజంగా అభినందనీయం' అని విజయ్ రాకను స్వాగతించారు.విజయ్ రాజకీయాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తారో పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ క్లారిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

