ఇవాళ మెహందీ వేడుక

Virosh Wedding: టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న (VIROSH) వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ షెడ్యూల్ ప్రకారం ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన ITC మెమెంటోస్ (ITC Mementos) రిసార్ట్‌లో ఇవాళ మెహందీ వేడుక జరగనుంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దక్షిణ భారత సంప్రదాయాలు , ఆధునిక హంగుల కలయికతో ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఇప్పటికే వీరు ఉదయ్‌పూర్ చేరుకోగా, నిన్న రాత్రి సన్నిహితుల కోసం ఒక స్పెషల్ పార్టీ/డిన్నర్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను (పూల్ సైడ్ వాలీబాల్, జపనీస్ డిన్నర్ మెనూ) విజయ్, రష్మిక తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు.

అభిమానులు వీరికి ప్రేమతో పెట్టిన "విరోష్" అనే పేరునే తమ పెళ్లికి అధికారికంగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మెహందీ, రేపు హల్దీ వేడుక,ఎల్లుండి పెళ్లి,మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుంది.

వీరి పెళ్లి వేడుకల్లో గోప్యత కోసం 'నో ఫోన్ పాలసీ' (No Phone Policy) మరియు త్రీ-టైర్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. అందుకే బయటకు ఫొటోలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబలి’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా వారు కనిపించబోయే మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

PolitEnt Media

PolitEnt Media

Next Story