‘Virosh’ Wedding Highlights: విరోష్ పెళ్లిలో జపనీస్ వంటకాలు..
జపనీస్ వంటకాలు..

‘Virosh’ Wedding Highlights: ప్లేట్ లో సుష్.. పక్కనే సాషిమి.. తాజా పండ్లు, పూల మధ్య జపనీస్ ఫైన్ డైనింగ్.! నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా జపనీస్ వంటకాల మెనూ నిలిచింది. అతిథుల కోసం ప్రత్యేకంగా రూపొందిం చిన ఫైన్ డైనింగ్ మెనూను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమాచారం ప్రకారం, మెనూలో సుషి, సాషిమి. టెంపురా వంటి సంప్రదాయ జపనీస్ వంటకాలు ఉన్నాయి. పింక్ లిల్లీస్, హై డ్రేంజియా పూలతో పాటు ఆపిల్స్, ద్రాక్ష వంటి తాజా పండ్లతో టేబుల్ అలంకరణ చేశారు.
బంగారు కాంతుల్లో ఈ డైనింగ్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలు ఉదయపూర్ సమీపంలోని లగ్జరీ రిసార్ట్ ఐటీసీ మిమెంటోస్ లో జరుగుతున్నాయి. పూర్తిగా ప్రైవేట్గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు సుమారు 100 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారు. వివాహ వేడుకలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమై 26 వరకు కొనసాగనున్నాయి. ఈ జంట పెళ్లిని అభిమానులు పెట్టిన 'విరోష్' పేరుతో గుర్తించనున్నారు. విజయ్ షేర్ చేసిన ఫొటోల్లో స్విమ్మింగ్ పూల్లో వాలీబాల్ ఆటలు. నీటిమీద తేలియాడే డ్రింక్ స్టేషన్.. బంగారు కాంతుల్లో మెరిసే డైనింగ్ టేబుల్స్... పూలు పం డ్ల తో అలంకరించిన లగ్జరీ డెకార్ ఉన్నాయి.

