Legacy Teaser: పొలిటీషియన్ గా విశ్వక్ సేన్ .. లెగసీ టీజర్
లెగసీ టీజర్

Legacy Teaser: రాజకీయం అంటే పులిమీద స్వారీ అంటారు. మరి ఆ పులిమీద నాయకుడు ఒక్కడే కుర్చోవాలా, లేదా తన కుటుంబం మొత్తం కుర్చోవాలా. దిగితే చంపేస్తారు కదా. మరి తన కుటుంబం, తన వారసులు, తన ఫ్యామిలీ లెగసీ ఏమైపోవాలి..’ అంటున్నాడు విశ్వక్ సేన్. తను హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో డైలాగ్ ఇది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.
‘లెగసీ’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి ‘పిండం’ ఫేమ్ సాయి కిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తూ యశ్వంత్ దగ్గుమాటితో కలిసి నిర్మిస్తున్నాడు. ఇదొక పొలిటికల్ డ్రామా. టీజర్‌లో విశ్వక్ సేన్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యంగ్ పొలిటీషియన్‌గా డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, పవర్ గేమ్స్‌లో తన కుటుంబాన్ని కూడా వాడుకునే తండ్రి.. ఇదొక ఇంటర్నల్ వార్.. ఫర్ రియల్ లెగసీ’ అని విశ్వక్ చెప్పడం సినిమాపై క్యూరియాసిటీని పెంచు తోంది. అలాగే ఇందు లో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా, రావు రమేష్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కే కే మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలియజేశారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు.

