రిలీజ్ డేట్ లాక్..!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! ఆయన హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.నిజానికి ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. వీఎఫ్‌ఎక్స్ (VFX) పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గతంలో విడుదలైన టీజర్‌లోని వీఎఫ్‌ఎక్స్ వర్క్‌పై కొన్ని విమర్శలు రావడంతో.. ఇప్పుడు ఆ విషయంలో చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అవుట్‌పుట్ అత్యుత్తమంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాణానంతర పనులను వేగవంతం చేస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ విలన్‌గా నటిస్తుండగా.. ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.

ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. ‘విశ్వంభర’ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి సిద్ధమవుతున్నారు.మరి జులైలో రాబోతున్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story