హింట్ ఇచ్చిన మెగాస్టార్

Vishwambhara to Release This Summer: వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తోన్న'విశ్వంభర' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇది మొదట 2025 సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా ఆలస్యమైంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ సినిమా వేసవి 2026లో విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగం గ్రాఫిక్స్ ,VFX మీద ఆధారపడి ఉన్నందున, నాణ్యత విషయంలో రాజీపడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

అతను తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అప్డేట్ ఇస్తూ మూవీ గ్లింప్స్‌ను ఇవాళ (ఆగస్టు 21) సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను అందరూ ఎంజాయ్‌ చేసేలా ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తున్నాం. విశ్వంభర అందరికీ ఇష్టమైన 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఎంజాయ్‌ చేయండి’ అని చిరంజీవి వీడియో ద్వారా తెలిపారు.

ఈ గ్లింప్స్ లోనే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించవచ్చు. ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ నాణ్యత విషయంలో రాజీపడటానికి ఇష్టం లేకపోవడంతో సమ్మర్ 2026కి వాయిదా పడింది.

బింబిసార' ఫేమ్ దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఏడేడు పద్నాలుగు లోకాల కథాంశంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story