Vishwambhara Update: విశ్వంభర అప్ డేట్.. మెగా ఫ్యాన్స్ కు పండగే!
విశ్వంభర అప్ డేట్.. మెగా ఫ్యాన్స్ కు పండగే!

Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విశ్వంభర. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. భారీ విజువల్స్, విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విడుదల తేదీ గురించి క్లారిటీ రాకపోవడంతో చిరు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు సినిమా గురించి సైలెంట్ గా ఉన్న వశిష్ట ఓ క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, ఒక పాట మాత్రమే మిగిలి ఉందంటున్నారు. ఈ సినిమాకు భారీగీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఫ్రేమ్ లో విజువల్ అద్భుతంగా ఉండాలనే ఆకాంక్షతో తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. మి గిలిపోయిన పాటను కూడా త్వరలో చిత్రీకరి స్తామని చెప్పుకొచ్చారు. ఈ స్పెషల్ సాంగ్లో మౌని రాయ్ కనిపించనున్నారన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే విడుదల తేదీ ప్రకటిస్తామంటున్నారు డైరెక్టర్ వశిష్ట తెలిపారు. మెగా అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
