Vrusshabha Movie: రూ.70 కోట్ల సినిమా.. ఫస్ట్ డే రూ.70 లక్షల కలెక్షన్లు
ఫస్ట్ డే రూ.70 లక్షల కలెక్షన్లు

Vrusshabha Movie: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం 'వృషభ' (Vrusshabha) నిన్న క్రిస్మస్ కానుకగా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఊహించని విధంగా షాకింగ్ వసూళ్లు నమోదయ్యాయి.తొలిరోజు దాదాపు రూ. 70 లక్షల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బడ్జెట్‌తో పోలిస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు చాలా తక్కువగా ఉండటం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
మోహన్ లాల్ కెరీర్‌లోనే ఇది అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కేరళలో కేవలం రూ.10-11 లక్షలు, ఇతర భాషల్లో కలిపి మొత్తం రూ.35 లక్షల మేర మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం. సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. విజువల్స్ పర్వాలేదనిపిస్తున్నా, కథలో కొత్తదనం లేకపోవడం మైనస్‌గా మారింది. క్రిస్మస్ సందర్భంగా 'ఛాంపియన్', 'శంబాల', 'ఈషా' వంటి ఇతర సినిమాలు కూడా విడుదల కావడంతో థియేటర్లు,ప్రేక్షకుల ఆదరణ చీలిపోయింది.
పీరియాడిక్ ఫాంటసీ డ్రామా అయినప్పటికీ, విడుదలకు ముందు సినిమాపై తగినంత బజ్ క్రియేట్ కాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ప్రాథమికంగా అందుతున్న ట్రేడ్ లెక్కలు. అధికారికంగా చిత్ర బృందం నుండి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.

