War 2 Trailer: వార్ 2 ట్రైలర్.. హై ఓల్టేజ్ యాక్షన్
హై ఓల్టేజ్ యాక్షన్

War 2 Trailer: హృతిక్ రోషన్,జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న వార్ 2 ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండున్నర నిమిషాలు గల ఈ ట్రైలర్ హై-ఆక్టేన్ యాక్షన్, అద్భుతమైన విజువల్స్ , డ్రామాతో నిండి ఉంది.
ట్రైలర్ నేను నా గుర్తింపును వదిలేసి, ఊరు పేరు లేని ఓ నీడగా మారిపోతాను ..మిత్రులైనా ఆప్తులైనా పట్టించుకోను ప్రేమించిన వారిని కూడా చూడను వెనకడుగు వేయకుండా వెళ్లిపోతా అంటూ హృతిక్ రోషన్ డైలాగ్స్.. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ లేకుండా ఒక ఓడపై నిలబడి..ఎవరూ చేయలేని పనుల్ని చేస్తానే.. ఎవరూ పోరాడలేని యుద్దంలో నేను పోరాడుతాను. ఇపుడు నేను మనిషిని కాదు..ఆయుధాన్ని చంపుతా లేక చస్తా అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఆసక్తికరంగా ఉన్నాయి.
కియారా అద్వానీ కూడా సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది, హృతిక్ రోషన్‌తో కలిసి యాక్షన్ సన్నివేశాలలో కనిపిస్తుంది. భారీ స్థాయి యాక్షన్ చిత్రంలో కియారా నటించడం ఇదే మొదటిసారి.
వార్ 2 అనేది YRF స్పై యూనివర్స్‌లో ఆరవ చిత్రం. ఈ యూనివర్స్‌లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్,,టైగర్ 3 వంటి చిత్రాలు ఉన్నాయి. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
