Kannappa Heroine: కన్నప్ప హీరోయిన్ ను కావాలనే పక్కన పెట్టారా..?
కావాలనే పక్కన పెట్టారా..?

Kannappa Heroine:కన్నప్ప సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. ప్రమోషన్లను కూడా వేరే లెవల్లో చేశాడు మంచు విష్ణు. ముంబైలో టీజర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుంచి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సక్సెస్ ఫుల్గా సాగిపోయింది. విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్ గా లాంచ్ చేశాడు.
అయితే ఇంత జరుగుతున్నా ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రమోషన్స్ కు ముఖం చాటేసింది. సినిమా ప్రమోషన్లలో ఆమె కనిపించడం లేదు. ఈ అమ్మడి పేరు కూడా పెద్దగా వినిపించడం లేదు. కన్నప్ప విష్ణుకే కాదు ప్రీతి ముకుందన్ కు మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ అమ్మడు కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. ఆమెకు ఇది మూడో సినిమా మాత్రమే. ఈ సినిమా హిట్ పడితే హ్యాట్రిక్ బ్యూటీ, గోల్డెన్ లేడీ, లక్కీ గర్ల్ అన్న బిరుదులు వచ్చేస్తుంటాయి. అలాంటిది ప్రీతి ముకుందన్ ఎక్కడా ప్రమోషన్లతో పాటు ఎలాంటి ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనలేదు.
కాజల్ ది చిన్న రోల్ కాబట్టి లైట్ తీసుకుంది అనుకుంటే ప్రీతి ఎందుకు స్కిప్ చేసిందో క్లారిటీ రాలేదు. చివరకు స్మాల్ రోల్స్ చేసిన మమ్ముట్టి, అక్షయ్ కుమార్, మధుబాల కూడా పలు ఈవెంట్లలో హాజరయ్యారు. కానీ ప్రీతి ముకుందన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
