Wedding Buzz Around Vijay and Trisha Krishnan: సీఎంగా బాధ్యతలు చేపట్టాక త్రిషతో విజయ్ వివాహం?
త్రిషతో విజయ్ వివాహం?

Wedding Buzz Around Vijay and Trisha Krishnan: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అందరి దృష్టి తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ పైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118)కు మరో 10 సీట్ల దూరంలో నిలిచారు. మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండగానే, మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
తమిళ సూపర్ స్టార్ విజయ్, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రముఖ నటి త్రిషను వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతతో విడిపోయి విడిగా ఉంటున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ఫ్యామిలీ కోర్టు ఈ కేసును జూన్ 15కి వాయిదా వేసిందని సమాచారం. ఉభయుల అంగీకారంతోనే ఈ విడిపోవడం జరుగుతుండటంతో, విజయ్ తదుపరి అడుగు త్రిషతోనే ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా, మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ అఖండ విజయం సాధించిన రోజునే త్రిష పుట్టినరోజు కూడా కావడం విశేషం. అదే రోజు త్రిష నేరుగా విజయ్ ని కలిసి అభినందనలు తెలపడం, సినీ ప్రముఖులు ఆమెను విజయ్ కి 'లక్కీ మస్కట్'గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చాయి. 'గిల్లి' నుంచి 'లియో' వరకు వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ కొనసాగుతోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ వైరల్ వార్తలపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

