స్పెషల్ అట్రాక్షన్ గా విరోష్ జోడి

Wedding Celebrations at the Allu Family Residence: అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్ , నయనిక రెడ్డిల వివాహం మార్చి 6న జరగనున్న నేపథ్యంలో నిన్నహైదరాబాద్‌లోని అల్లు నివాసంలో అత్యంత వైభవంగా 'పెళ్లి కొడుకు' వేడుక జరిగింది.ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 'విరోష్' (విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న) జోడీ.

ఇటీవల (ఫిబ్రవరి 26న) ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న విజయ్-రష్మిక జంట, పెళ్లయిన తర్వాత అధికారికంగా హాజరైన మొదటి ఫంక్షన్ ఇదే. కొత్త జంటగా వారు అల్లు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలో సందడి చేశారు. అల్లు అరవింద్, నిర్మలమ్మ దంపతులు, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి జంట విరోష్ జోడీని సాదరంగా ఆహ్వానించి ఆశీర్వదించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండను అల్లు అర్జున్ ఆలింగనం చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరై తన స్నేహితుడు శిరీష్‌కు విషెస్ తెలియజేశారు. ఉపాసన కొణిదెల తన కవల పిల్లలతో బిజీగా ఉండటం వల్ల ఈ వేడుకకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.మరోవైపు విజయ్-రష్మికల పెళ్లి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇది కేవలం ఆహ్వానితులకు మాత్రమే (Invite-only) పరిమితం చేసినట్లు వారు ఇప్పటికే ప్రకటించారు.అల్లు శిరీష్ తన వివాహం గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ..నయనిక, నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం అని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story