ప్రభాస్ నాతో ఏమన్నాడంటే.?

‘Raja Saab’ Result: డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న "రాజా సాబ్" సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ పట్ల డైరెక్టర్ మారుతి చాలా స్పష్టంగా, ధైర్యంగా స్పందించారు.

మారుతి మాట్లాడుతూ.. నేను ఎలాంటి సినిమా తీశానో నాకు తెలుసు. ప్రభాస్ ను ఒక కొత్త యాంగిల్‌లో, అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాను. "రాజా సాబ్‌లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్‌గా, ఫన్నీగా ఉన్నారు ... ఆయన కామెడీ టైమింగ్‌ను నేను వంద శాతం వాడుకున్నాను. లుక్ విషయంలో అభిమానులు కచ్చితంగా పండుగ చేసుకుంటున్నారు" అని చెప్పారు.ప్రభాస్ కూడా ‘ప్రశాంతంగా ఉండు డార్లింగ్.. మనం కొత్త ప్రయత్నం చేశాం, ఆడియెన్స్​కు చేరడానికి కొంత టైమ్ పడుతుంది’ అని చెప్పారు. సైకలాజికల్ సీన్స్‌ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చు.

ట్రోల్స్ చేయడం అనేది సోషల్ మీడియాలో ఒక భాగం. నేను వాటిని నెగెటివ్‌గా తీసుకోను. నా పని మీద నాకు నమ్మకం ఉంది. సినిమా ఫలితమే నా సమాధానం అవుతుంది" అని చాలా కూల్‌గా స్పందించారు.మారుతి తన బలమైన హారర్-కామెడీ జానర్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించారని, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఇలాంటి ప్రయోగం చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story