Bhootha Shuddhi Marriage: అసలేంటి భూతశుద్ధి వివాహం..ముహూర్తాలతో సంబంధం లేదా.?
ముహూర్తాలతో సంబంధం లేదా.?

Bhootha Shuddhi Marriage: నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం 'భూతశుద్ధి వివాహం' అనే ప్రత్యేక యోగ సంప్రదాయ పద్ధతిలో కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. సమంత గత కొన్నేళ్లుగా సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈశా ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు, అందుకే ఈ ఆధ్యాత్మిక విధానాన్ని ఆమె తన వివాహం కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సమంత,రాజ్ నిడిమోరుతో జరిగిన తన వివాహానికి సంబంధించిన పోస్టుకు సోషల్ మీడియాలో (ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో) భారీ స్పందన లభించింది.16 గంటల వ్యవధిలోనే ఆ పోస్టుకు దాదాపు 79.5 లక్షల (7.95 మిలియన్లు) లైక్స్ వచ్చాయి . అసలు ఈ భూతశుద్ధి పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి?
భూతశుద్ధి అనేది వేల సంవత్సరాలుగా యోగ సంప్రదాయంలో కొనసాగుతున్న ఒక పవిత్రమైన ప్రక్రియ.
'భూత' అంటే పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం).
'శుద్ధి' అంటే శుద్ధి చేయడం లేదా పరిశుద్ధం చేయడం.
భూతశుద్ధి వివాహంలో వధూవరుల దేహాలు, వారి జీవిత శక్తిలోని పంచభూతాలను శుద్ధి చేసే ఒక విశిష్టమైన క్రతువు నిర్వహిస్తారు. ఇది కేవలం శారీరక లేదా మానసిక బంధం కంటే అతీతంగా, లోతైన జీవశక్తి స్థాయిలో (Life Energy Level) దంపతుల మధ్య బలమైన మరియు సామరస్యపూర్వకమైన బంధాన్ని ఏర్పరుస్తుందని నమ్మకం.
సమంత పెళ్లిలో ప్రత్యేకతలు
సమంత-రాజ్ నిడిమోరు వివాహం ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయం వద్ద జరిగింది.
పంచభూతాల శుద్ధి: ఈ క్రతువు దంపతుల శరీరంలోని పంచభూతాలను సమన్వయం చేసి, వారి దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండేలా దేవి అనుగ్రహాన్ని కోరుతుంది.
మహిళా పూజారి: ఈ భూతశుద్ధి వివాహంలో క్రతువులన్నీ మహిళా పూజారి ద్వారా నిర్వహించడం ఒక ముఖ్యమైన ప్రత్యేకత. ఇది ఆధ్యాత్మిక సమానత్వానికి సంకేతంగా భావించబడుతుంది.
ముహూర్తంతో సంబంధం లేదు: సాధారణ హిందూ వివాహాలకు తప్పనిసరిగా శుభముహూర్తం అవసరం. కానీ, భూతశుద్ధి వివాహానికి ముహూర్తంతో సంబంధం ఉండదు; దీనిని ఎప్పుడైనా చేసుకోవచ్చు.
సాధారణ పద్ధతికి భిన్నం: ఇది సంప్రదాయ మంత్రోచ్ఛారణలతో పాటు, వధూవరుల శరీరం, మనస్సు , జీవశక్తి స్థాయులను సమన్వయం చేసే యోగిక ప్రక్రియలను కలిగి ఉంటుంది.

