Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ చేజారిన రూ. 15 వేల కోట్ల ఆస్తి ఎక్కడిది?
రూ. 15 వేల కోట్ల ఆస్తి ఎక్కడిది?

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు రూ.15 వేల కోట్ల ఆస్తులు చేజారాయి. పటౌడీ నవాబు కుటుం బానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకో ర్టులో ఎదురు దెబ్బ తగిలింది. భోపాల్లోని ఆయన పూర్వీకులకు చెందిన ఆస్తుల కేసులో ఆయనకు వ్యతి రేకంగా తీర్పు వచ్చింది. ఈ ఆస్తులను 'శత్రు ఆస్తి'గా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం దాఖలు చేసిన పిటి షన్ ను హైకోర్టు కొట్టివేసింది. 25 ఏళ్లుగా ఈ కేసుపై న్యాయపోరాటం జరుగుతుండగా, తాజా తీర్పుతో సైఫ్ కుటుంబం ఆశలు సన్నగిల్లినట్లయింది. భోపాల్ చివరి నవాబు హమీద్ ఉల్లా ఖాన్ పెద్ద కుమార్తె, అసలు వార సురాలైన అబిదా సుల్తాన్ (సైఫ్ ముత్తవ్వ) దేశ విభజన తర్వాత పాకిస్థాన్ కు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీ కరించారు. దీనితో, 1968 నాటి 'శత్రు ఆస్తుల చట్టం' ప్రకారం ఆమెకు చెందాల్సిన ఆస్తులను అప్పటి కేంద్ర ప్రభుత్వం వర్గీకరించింది. శత్రుదేశాల పౌరసత్వం స్వీ కరించిన వారి ఆస్తులు ఈ చట్టం కింద ప్రభుత్వపరం అవుతాయి. నవాబు రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ (సైఫ్ అలీ ఖాన్ నాయనమ్మ) భారతదేశంలోనే ఉండిపోయారని, కాబట్టి వారసత్వం ఆమెకే చెందుతుందని సైఫ్ కుటుంబం వాదిస్తోంది. ఈ వివాదంలో నూర్ ఉస్సబా ప్యాలెస్, ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, అహ్మదా బాద్ ప్యాలెస్ వంటి అత్యంత విలువైన, చారి త్రక భవనాలు కూడా ఉన్నాయి. నవాబు వ్యక్తిగత ఆస్తులు కూడా రాచరిక వా రసత్వంలో భాగమేనన్న వాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయంటూ తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది.
