స్పిరిట్ రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas Spirit: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. 'ది రాజా సాబ్' మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉండగా హను రాఘవపూడితో 'ఫౌజీ' షూటింగ్ శరవేగంగా జరుగుతోం ది. ఈ రెండు చిత్రాలు కూడా వేర్వేరు జోనర్లలో తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో 'స్పిరిట్' సినిమా తెరకెక్క నుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నె లకొన్నాయి. ఇందులో ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ చి త్రాన్ని సెప్టెంబర్ లో పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తాయా అని మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. ఇక సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీన్ని తొమ్మిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌.When Is Prabhas' 'Spirit' Releasing?

PolitEnt Media

PolitEnt Media

Next Story