రెండో సింగిల్ ఎపుడంటే.? .

The Girlfriend: రష్మిక మందన ప్రధాన,దీక్షిత్ షెట్టి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. రావు రమేష్, రోహిణి వంటి నటులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన రూపొందిస్తున్న మూడో చిత్రం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ప్రధానంగా రష్మిక పాత్ర చుట్టూ కథ అల్లుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు హెషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ అవ్వగా..ఏం జరుగుతోంది అనే రెండో సాంగ్ ను ఆగస్టు 26 (రేపు) రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. ఈ సాంగ్ ను చిన్మయి పాడిందని..ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా ఈ పాట ఉంటుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story