Vijay and Rashmika’s Wedding: సిని హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ఈ నెల 26 న ప్రఖ్యాత ఉదయ్ పూర్ ప్యా లెస్లో వీరి వివాహం జరగ నుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే నెల 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో వీరి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు కార్డులో ఉంది. ఫిబ్రవరి 20 నాటికి ఇరు కుటుంబాలు ఉద ష్ఫూర్కు చేరుకుని.. 22వ తేదీ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి వేడుకల్లో పా ల్గొంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 26వ తేదీనపెళ్లి చేసుకుని.. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మార్చి 4న సాయంత్రం 7 గంటలకు తాజ్ కృష్ణాలోసినీ, రాజకీయ, ఇతర ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్టు ఆ కార్డులో ఉంది.

వీరిద్దరూ కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో నటించారు. అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. తరచూ కలిసి వెకేషన్లకు వెళ్తుండటం, ఒకే రకమైన ఫోటోలు షేర్ చేయడంతో వీరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఇపుడు వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడింది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story