కాల్పులు జరిపింది ఎవరంటే?

Disha Patani: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న ఆమె ఇంటి వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి, దిశా పటానీ నివాసం ముందు మూడు నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.

అయితే ఈ కాల్పులకు గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా గ్యాంగ్ బాధ్యత వహించింది. కొంతమంది హిందూ సన్యాసులను, ముఖ్యంగా ప్రేమానంద్ మహారాజ్ , అనిరుద్ధాచార్య మహారాజ్ లను దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ అవమానించినందుకు నిరసనగా ఈ కాల్పులు జరిపినట్లు ఆ పోస్ట్‌లో ఉంది.ఈ ఘటన కేవలం ఒక "ట్రైలర్" మాత్రమేనని, మరెవరైనా తమ మతానికి లేదా సన్యాసులకు అగౌరవం చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ గ్యాంగ్ హెచ్చరించింది.

ఈ సంఘటనపై దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ఈ ఘటన బాలీవుడ్‌లో భద్రతపై ఆందోళనలను పెంచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story