Sonu Sood: జెన్-జీ యువతపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నటుడు సోనూసూద్ తీవ్రంగా స్పందించారు. నటులను, స్టార్లుగా నిలబెట్టేది యువతేనని, వారిని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని హితవు పలికారు.

ఇదివరకు నీట్ పేపర్ లీక్ తదితర అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపిన జెన్-జీ (Gen-Z) యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయని, వారి భాష అత్యంత అసభ్యకరంగా ఉందంటూ వారిని 'జెనరేషన్ గట్టర్' (Generation Gutter) అంటూ ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి.

కంగనా వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన నటుడు సోనూసూద్.. యువతను అలా అనడం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు. "ఆమె నిజంగా ఆ మాట అని ఉంటే అది సరికాదు. నోరు జారే ముందు ప్రతి ఒక్కరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి" అని ఆయన హితవు పలికారు.

నటులను, ప్రజాప్రతినిధులను ఉన్నత స్థానంలో నిలబెట్టేది యువతేనని సోనూసూద్ గుర్తుచేశారు. ప్రజల మద్దతు లేకపోతే ఎవరూ ఎదుగులేరని, వృత్తి ఏదైనా ప్రజలతో మమేకమైనప్పుడే దానికి సార్థకత ఉంటుందని చెప్పారు. ప్రజలే దేవుళ్లని పేర్కొంటూ.. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు

PolitEnt Media

PolitEnt Media

Next Story