Sobhita: చాలా కాలంగా సినిమాల్లో మహిళలను హీరో కోణంలోనే చూపిస్తున్నారని నటి శోభిత అభిప్రాయపడింది. ఎక్కువగా హీరో తల్లిగా, హీరో భార్యగా లేదా ప్రేయసిగా మాత్రమే మహిళల పాత్రలను చూపిస్తున్నారని ఆమె చెప్పింది. కానీ మహిళలు కూడా తమ జీవితాలను, తమ ఆలోచనలను తెరపై చూడాలని కోరుకుంటున్నారని శోభిత తెలిపింది.

ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను చెప్పింది. మహిళలను కేవలం హీరోకు సంబంధించిన పాత్రలుగానే కాకుండా, వారి సొంత ఆలోచనలు, భావాలు, జీవితాలతో చూపించాలని ఆమె అభిప్రాయపడింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో కథలు ఉన్నాయని, అలాంటి కథలు కూడా సినిమాల్లో రావాల్సిన అవసరం ఉందని ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది.

మరోవైపు, శోభిత తన నటనా జీవితంతో పాటు ఫ్యాషన్ ఫొటోషూట్లలోనూ పాల్గొంటోంది. వివిధ మ్యాగజైన్ల కోసం ఫొటోషూట్లు చేస్తూ, వాటి కవర్ పేజీలపై కూడా కనిపిస్తోంది. ఇలా సినిమాలు, ఫ్యాషన్ షూట్లు, మ్యాగజైన్‌లతో బిజీగా ఉంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

Next Story