కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Yash Fans in Shock: కన్నడ స్టార్ హీరో యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమే నిజమైంది. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ మూవీ జూన్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వాయిదా వెనుక ప్రధానంగా మధ్యప్రాచ్యం (Middle East) లో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నట్లు తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ సినిమాకు కీలకమైన ఓవర్సీస్ మార్కెట్లు కావడంతో, అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, ఈ అదనపు సమయాన్ని సినిమా ప్రమోషన్ల కోసం వాడుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇటీవల యశ్, కియారా అద్వానీలపై విడుదలైన మొదటి సాంగ్ ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వకపోవడం, అభిమానుల నుంచి ప్రమోషన్లు సరిగ్గా లేవనే అసంతృప్తి వ్యక్తం కావడంతో.. జూన్ నాటికి భారీ పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో గ్లోబల్ ఆడియన్స్ కోసం రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం యశ్ దాదాపు మూడేళ్లుగా కష్టపడుతున్నారు. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంపై కేజీఎఫ్-2 తర్వాత భారీ అంచనాలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story