టాలీవుడ్ ఎంట్రీ..

Yogi Babu: తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటుడు యోగి బాబు. ఆయన తమిళంలో వందల సినిమాల్లో నటించి, తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. యోగి బాబు ప్రధానంగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ, ఆయన నటించిన చాలా తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా విడుదలవుతున్నాయి.
వీటిలో వారసుడు విజయ్ హీరోగా నటించిన ఈ తమిళ చిత్రం "వారిసు" తెలుగులోకి డబ్ అయింది. జైలర్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ విజయవంతమైన చిత్రం తెలుగులోనూ విడుదలైంది. బీస్ట్ విజయ్ నటించిన ఈ సినిమా కూడా తెలుగులోకి డబ్ అయింది. లవ్ టుడే యువతను ఆకట్టుకున్న ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయింది.
ఇపుడు యోగి బాబు డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. గుర్రం పాపిరెడ్డిగా వస్తున్న ఈ డార్క్ కామెడీ చిత్రంలో యోగి బాబు ఉడ్రాజు అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా (జూలై 22, 2025) ఈ సినిమా నుంచి యోగి బాబు పోస్టర్ ను విడుదల చేశారు. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రంలో యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
