సమంత రెండో పెళ్లిపై విమర్శలకు మాధవీలత కౌంటర్

Madhavi Latha Hits Back at Criticism Over Samantha’s Second Marriage: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల చేసుకున్న రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలకు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఘాటుగా స్పందించారు. సమంత వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఆమె విడుదల చేసిన వీడియో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

"సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ? ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసేవారు ముందు తమ సొంత సంబంధాల గురించి ఆలోచించుకోవాలి" అని మాధవీలత హితవు పలికారు.

"ఒకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లు, విడాకులు ఇవ్వకుండా సంబంధాలు నడిపేవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తోంది. మీరేమీ పతివ్రతలు కాదు కదా?" అంటూ విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని.. అయితే రుణాలు తీరిపోతే విడిపోవడం సహజమని మాధవీలత అభిప్రాయపడ్డారు. "ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? ఆ విషయంలో సంతోషించండి" అని ఆమె వ్యాఖ్యానించారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం తగదని ఆమె స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story